పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1 ఆదివారం ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఖరారు చేసిన తాత్కాలిక షెడ్యూల్ను ఉటంకిస్తూ సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం ప్రకటించారు. ఉభయసభలనుద్దేశించి జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసగించనున్నట్లు తెలిపారు. సాంప్రదాయం ప్రకారం.. సంవత్సరంలో మొదటి పార్లమెంట్ సమావేశాల మొదటి రోజున రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. జనవరి 29న బీటింగ్ రిట్రీట్ వేడుకల (భారత గణతంత్ర వేడుకల ముగింపును సూచించే సైనిక సాంప్రదాయం) కారణంగా ఆరోజు సమావేశం నిర్వహించబడదు. జనవరి 30న ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జనవరి 31న ఉభయసభలు సమావేశం కావు. ఫ్రిబవరి 1న ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
![]()
