డిఫెండింగ్ ఛాంపియన్ చతికిల పడింది. సూపర్8 పోరులో దక్షిణాఫ్రికాకు కనీస పోటీ ఇవ్వలేదు. 188 పరుగుల ఛేదనలో భారత బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు. శివం దూబె (42, 37 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మినహా అందరూ నిరాశపరిచారు. ఇషాన్ కిషన్ (0), తిలక్ వర్మ (1), అభిషేక్ శర్మ (15) పవర్‌ప్లేలోనే నిష్క్రమించగా.. మిడిల్ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (18), వాషింగ్టన్ సుందర్ (11), హార్దిక్ పాండ్య (18), రింకు సింగ్ (0)ను కట్టడి చేసిన దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. 18.5 ఓవర్లలో భారత్ 111 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. డేవిడ్ మిల్లర్ (63, 35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), డెవాల్డ్ బ్రెవిస్ (45, 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్, 24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరవటంతో 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. 
![]()
