ప్రపంచకప్‌లో కీలక దశకు చేరుకున్న టీమిండియా మరో సవాల్‌కు సిద్ధమైంది. గ్రూప్ దశలో అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించిన భారత జట్టు, సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్యంగా పరాజయం చెందడం నిరాశ కలిగించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 111 పరుగులకే కుప్పకూలి 76 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రెండూ ఒకేసారి విఫలమవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌లపై జరిగే మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో గురువారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సాధారణంగా ఈ మైదానం స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందనే పేరు ఉన్నా, ఈసారి పిచ్ బ్యాటింగ్‌కు సహకరించేలా సిద్ధం చేసినట్లు సమాచారం. బంతి బ్యాట్‌పై బాగా వస్తే భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది.
![]()
