ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి రానున్నారు. స్థానిక హరిత రిసార్ట్స్‌లో జరుగుతున్న తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎయిరిండియా విమానంలో ఉదయం 9.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్.. అక్కడి నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో అనంతగిరికి వెళతారు. 
![]()
