మారుతున్న కాలానికి అనుగుణంగా
కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శాసనసభలో గురువారం ఆయన జనాభా నిర్వహణపై డ్రాఫ్ట్ పాలసీని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకూ జనాభా నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందని అన్నారు. రాష్ట్రంలో పెర్టిలిటీ రేటు ప్రస్తుతం 1.5 శాతంగా ఉందని, ఇదే పద్దతిలో వెళితే మరింత తగ్గే ప్రమాదం ఉందని చెప్పారు. జనాభాను సక్రమంగా నిర్వహించేందుకు మాతృత్వం, శక్తి, నైపుణ్యం, క్షేమం, సంజీవని అనే పంచ సూత్రాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రోత్ రేట్ తక్కువగా ఉందని, 2.1 శాతం కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గుతుందని తెలిపారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో కేవలం ఏడాదికి 6.70 లక్షల జననాలు మాత్రమే ఉన్నాయని, ఇది కొనసాగితే 2047 నాటికి 23 శాతం మంది వృద్ధులే ఉంటారని చెప్పారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై ప్రతి నియోజకవర్గంలో నెలరోజులపాటు ప్రజాప్రతినిధులు చర్చించాలని పేర్కొన్నారు.
![]()
