దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైసినా డైలాగ్-2026’ సదస్సు
లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సంస్కరణల వల్లే మన దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారని అన్నారు. ‘సాంకేతికత-సుపరిపాలన’ భవిష్యత్తు అంశాలపై చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాల్లో కేంద్రంతో కలిసి ముందుకెళ్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనిటీకి సేవ చేసే సామర్థ్యం భారత్‌కే ఉందని సీఎం అన్నారు.
![]()
