ప్రపంచంలోనే ఎత్తయిన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం గోవాలోని పార్టగల్ గ్రామంలో ఆవిష్కరించారు. ఈ విగ్రహం ఎత్తు 77 అడుగులు. శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గవర్నరు అశోకగజపతిరాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన కర్ణాటకలోని ఉడిపిలో శ్రీకృష్ణ మఠం, పర్యాయ పుట్టిగే మఠం నిర్వహించిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
![]()
