కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని నటిస్తున్న తాజా చిత్రం ‘వంద దేవుళ్లు’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ నటుడు మంచు విష్ణు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కథానాయకుడు విజయ్ ఆంటోని, దర్శకుడు శశి, నటి శ్వాసికతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. విభిన్నమైన కథాంశాలతో అలరించే విజయ్ ఆంటోని, ఈసారి కూడా ఒక ఆసక్తికరమైన చిత్రంతో రాబోతున్నారని ఈ లుక్ స్పష్టం చేస్తోంది.
![]()
