దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న కొత్త సినిమా ‘వారణాసి’ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా అది హాలీవుడ్స్థాయికి వెళ్తోంది. సాధారణంగా రాజమౌళి ఏ సినిమా తీసినా కాస్త రహస్యంగానే ఉంచుతారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో ఇలాంటివి చూడొచ్చు. తాజాగా ఆయన కథానాయకుడు మహేష్‌బాబుతో తీస్తున్న ‘వారణాసి’ కోసం సరికొత్తగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రాజమౌళి తను ఏ సినిమా తీసినా సినిమా విడుదలకు మరికొద్దిరోజులకు ముందుగానే ప్రచారానికి వదిలేవారు. ఇప్పుడు ఏకంగా విడుదలకు ఏడాదిన్నర ముందే టీజర్ లాంటిది రిలీజ్ చేయటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మూవీ సెట్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. గతేడాది నవంబరులో మూవీ టీజర్, గ్లింప్స్ రిలీజ్ సమయంలో హాలీవుడ్ మీడియా సైతం హైదరాబాద్ వచ్చింది. ఆ సమయంలో తానే స్వయంగా వాళ్లని ‘వారణాసి’ షూటింగ్ లొకేషన్లకు తీసుకెళ్లారు. అప్పుడు వాళ్లు సెట్స్‌కు సంబంధించిన వీడియోలు తీసుకున్నారు. వారణాసి వీధులు, షూట్స్ తదితర సెట్స్ ఇందులో చూపించారు. మినీయేచర్ సెట్ ఆకట్టుకునేలా ఉంది
![]()
