మార్కాపురం జిల్లా రాయవరం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం
14మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ ప్రైవేటు బస్సు జగిత్యాల నుండి వింజమూరు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. పలకల క్వారీ వద్ద టిప్పర్, బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14మంది సజీవ దహనం అయ్యారని ప్రాధమిక సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొత్తం 40మంది ప్రయాణిస్తున్న బస్సు అగ్నికి ఆహుతి అయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఈ ప్రైవేటు బస్సు యార్లగడ్డ కోటేశ్వరరావుది రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది.
![]()
