క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్ మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. భారత్‌లో ఈ టోర్నమెంట్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకు
న్న జియోహాట్‌స్టార్ తమ వెబ్సైట్, మొబైల్ యాప్‌లో మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈసారి జియోహాట్‌స్టార్‌లో ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ కామెంట్రీ అందుబాటులో ఉంటుంది. అదనంగా బెంగాలీ, భోజ్‌పురి, హర్యానీ భాషల్లోనూ ఫీడ్స్ ఉంటాయి. మొబైల్ యూజర్ల కోసం ప్రత్యేకంగా వర్టికల్ లైవ్ ఫీడ్, 360-డిగ్రీ వ్యూ, మల్టీ-క్యామ్ ఫీచర్లను కూడా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
![]()
