అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న
దీలో మార్పు జరిగింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 1న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తూ.. జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఒక సంపూర్ణ సినిమాటిక్ అనుభూతిని ‘లెనిన్’ అందిస్తుందని, అత్యుత్తమ రూపంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం హామీ ఇచ్చింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
![]()
