వ్యవహరించనుంది. అలాంటి వారి జీతంలో 15 శాతం వరకు కోత విధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లును ఆదివారం తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
మాట్లాడుతూ, వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించడంలో ఈ బిల్లు ఒక చరిత్రాత్మక ముందడుగు అని అభివర్ణించారు. సమాజంలో మానవ సంబంధాలు, బంధుత్వాలు బలహీనపడి, కేవలం సంపాదన, భౌతిక సుఖాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “కన్నవారు కన్నీరు పెట్టే పరిస్థితి రావడం సమాజానికి మంచిది కాదు. తల్లిదండ్రులను గౌరవించని వారిలో భయం కలిగించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చాం” అని సీఎం స్పష్టం చేశారు.
![]()
