సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర
మోదీకి లేఖ రాస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారికి తెలంగాణ ప్రజలంతా అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. గాంధీ భవన్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమ పార్టీ నేతలపై కేసులు పెడితే భయపడేది లేదని స్పష్టం చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎంతో త్యాగం చేసిందని ఆయన కొనియాడారు.
సాధారణంగా ప్రైవేటు సంస్థల్లో పని చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవని, కానీ ఎప్పుడో మూతబడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందిని మంచి ఆలోచనతో ఆర్థికంగా ఆదుకోవాలని సోనియా గాంధీ భావించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలనే ఉద్దేశంతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పునరుద్ధరించే ప్రక్రియను చేపట్టారని పేర్కొన్నారు. పత్రికను నడిపేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులను తీసుకున్నారని అన్నారు.
![]()
