న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశం ఉభయ సభల్ని కుదిపేసింది. ఎస్ఐఆర్పై చర్చకు అధికార పక్షం ముందుకు రాకపోవడంతో
ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా అమలు చేస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేసిన ఆందోళనతో వరుసగా రెండో రోజు కూడా లోక్సభకు అంతరాయం కలిగింది. రాజ్యసభలో కూడా అనేకసార్లు కార్యకలాపాలు అంతరాయం కలిగింది. హడావిడిగా ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడంపై అత్యవసరంగా చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీనివల్ల అనేక రాష్ట్రాల్లో ఒత్తిడితో అనేకమంది బిఎల్వోలు ఆత్మహత్య చేసుకున్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ తర్వాతే ఎస్ఐఆర్ అంశాన్ని పరిగణించవచ్చని మోడీ ప్రభుత్వం మొండిపట్టుదలతో ఉంది. ఇప్పటికే కుదించిన శీతాకాల సమావేశాలను ఎటువంటి గందరగోళం లేకుండా శాంతియుతంగా నిర్వహించడంలో తమకు ఆసక్తి లేనట్టుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది. శీతాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎస్ఐఆర్తో సహా ఏదైనా అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
![]()
