దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు సాధించినప్పటికీ టీమిండియాకు ఓటమి తప్పలేదు. బుధవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో విపరీతంగా కురిసిన మంచు బౌలింగ్‌ను కష్టతరం చేసిందని, టాస్ ఓడిపోవడం తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ సెంచరీలతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ (66 నాటౌట్) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే, ఛేదనలో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్రమ్ (110) శతకంతో చెలరేగగా, మాథ్యూ బ్రీట్జ్కే (68), డెవాల్డ్ బ్రెవిస్ (54) రాణించడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
![]()
