తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. “గతంలో గుజరాత్ మోడల్ అభివృద్ధికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎలా సహకరించారో, ఇప్పుడు మీరు తెలంగాణ మోడల్‌ను దేశానికి ఆదర్శంగా నిలిపే మా ప్రయత్నానికి అలాగే చేయూతనివ్వాలి” అని రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. హైదరాబాద్-బెంగళూరు-చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్, మెట్రో రైల్ రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం వంటి ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. రెండు టర్ములు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను” అని ధీమా వ్యక్తం చేశారు.
![]()
