రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల కీలక పర్యటన కోసం గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి పుతిన్‌కు సాదరంగా స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, ఒకరినొకరు పలకరించుకున్నారు. అనంతరం ఒకే వాహనంలో విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లడం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ ప్రత్యేక స్వాగతంపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “నా మిత్రుడు, అధ్యక్షుడు పుతిన్‌కు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో జరగబోయే సమావేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారత్-రష్యా స్నేహం కాలపరీక్షకు నిలిచింది, ఇది మన ప్రజలకు ఎంతో మేలు చేసింది” అని పేర్కొన్నారు.
![]()
