భారత పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్
పుతిన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రత్యేకమైన బహుమతులను అందజేశారు. ఇవి కేవలం వస్తువులు కావు, భారతీయ సంస్కృతి, వారసత్వం, హస్తకళల గొప్పతనానికి అద్దం పట్టే ప్రతీకలు. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పుతిన్‌కు ఈ కానుకలను అందించారు. ప్రతి బహుమతిని ఎంతో ఆలోచించి, ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని ప్రతిబింబించేలా ఎంపిక చేయడం విశేషం.
![]()
