సంస్థలు అడ్డగోలుగా ఛార్జీలు పెంచడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు. అవకాశవాద ధరల విధానాలతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టడాన్ని ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు. నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విమాన టికెట్ల ధరలను ఎప్పటికప్పుడు రియల్ టైమ్ డేటా ద్వారా నిశితంగా గమనిస్తామని, ఇందుకోసం ఎయిర్‌లైన్స్ మరియు ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లతో నిరంతరం సమన్వయం చేసుకుంటామని తెలిపారు. ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని రామ్మోహన్ నాయుడు పునరుద్ఘాటించారు.
![]()
