ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ తొలిరోజే పెట్టుబడుల సునామీ సృష్టించింది. సోమవారం ప్రారంభమైన ఈ సదస్సులో ఏకంగా 35కు పైగా సంస్థలు సుమారు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటివరకు దావోస్‌కు వెళ్లి పెట్టుబడులను ఆకర్షించే సంప్రదాయానికి భిన్నంగా, ఈసారి దావోస్‌నే హైదరాబాద్‌కు రప్పించడంలో రేవంత్ సర్కార్ విజయం సాధించిందని పారిశ్రామిక వర్గాలు ప్రశంసించాయి.
హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన ఈ సదస్సులో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్’ రూ.41 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. రాబోయే పదేళ్లలో తమ పెట్టుబడులను లక్ష కోట్లకు పెంచుతామని సంస్థ డైరెక్టర్ ఎరిక్ స్విడర్ తెలిపారు. బ్రూక్‌ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి గ్లోబల్ రీసెర్చ్, డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు రూ.75 వేల కోట్లు, విన్ గ్రూప్ పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.27,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.
![]()
