దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టి20లో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టి20లోనూ నెగ్గి సిరీస్ ఆధిక్యతలో దూసుకెళ్లాలని భావిస్తోంది. కటక్ వేదికగా జరిగిన తొలి టి20లో 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన భారతజట్టు గత రెండేళ్లలో సిరీస్ కోల్పోయిన దాఖలాలు లేవు. కేవలం ఒక రోజు వ్యవధిలో రెండో టి20కి సిద్ధమైన ఇరుజట్లు ఆఘ మేఘాలమీద మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంకు చేరుకున్నాయి. కనీసం ప్రాక్టీస్ కూడా లేకుండా రెండో టి20కి సిద్ధమయ్యాయి. తొలి టి20లో ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మకి తోడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కి తోడు మిడిలార్డర్లో తిలక్ వర్మ, అక్షర్ పటేల్‌కి తోడైతే టీమిండియా భారీస్కోర్ నమోదు చేయడం ఖాయం.
![]()
