ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఏపీలో పదేళ్ల తర్వాత 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అంతకు ముందు కూడా పొత్తు వ్యవహారంలో టీడీపీకి – బీజేపీకి మధ్య సయోధ్య కుదిరించే విషయంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరొందారు. ప్రధాని మోడీ కూడా స్వయంగా ప్రతి సభలోనూ పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాఖ్యానించడం చూస్తూనే ఉంటున్నాం.
ఈ క్రమంలోనే ఏపీలో యాక్టివ్ గా ఉన్న జనసేనను తెలంగాణలో కూడా ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికా రూపొందిస్తున్నట్టు కనిపిస్తుంది. హైదరాబాద్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని జనసేన గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగం ప్రకటించారు. ఎన్నికల ముందు పార్టీ శక్తి, వ్యూహాలపై చర్చించేందుకు ఆయన కూకట్పల్లిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
![]()
