ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు రాబోయే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించి, అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ మేరకు ఆయన పలు విజ్ఞాపన పత్రాలను కేంద్ర మంత్రికి అందజేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రానున్న మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్థిక సహాయం అవసరమని, దీని కోసం వచ్చే బడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు కోరారు.
![]()
