దక్షిణాఫ్రికాతో జరిగి
న ఐదు టి20ల సిరీస్ను టీమిండియా చేజిక్కించుకుంది. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో, చివరి టి20లో భారతజట్టు 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్కు దిగిన భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ(73), ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (63) ఆకాశమే హద్దుగా చెలరేగి మెరుపు అర్ధ శతకాలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 118 పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేపినా.. ఆ తర్వాత భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి(4/53), బుమ్రా(2/17) కట్టడిగా బౌలింగ్ చేసి సఫారీ జట్టు ఆశలపై నీళ్లు చల్లారు.
![]()
