విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తనదే బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో అనకాపల్లి జిల్లా, తాళ్లపాలెంలో ‘ముస్తాబు’ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి శనివారం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. తాళ్లపాలెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ
శాలలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించి, ‘ముస్తాబు’ కార్యక్రమం ద్వారా వారు పాటిస్తున్న వ్యక్తిగత శుభ్రత విధానాలను స్వయంగా పరిశీలించారు. పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించారు.
![]()
