పేదలకు నాణ్యమైన వైద్య విద్య, వైద్య సేవలు అందించే విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలోనే వైద్య కళాశాలల నిర్మాణం చేపడతామని, దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఇవాళ వైద్యారోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
![]()
