ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్-2 నియామకాల్లో రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లన్నింటినీ ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం వెలువడిన ఈ తీర్పుతో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ నిర్ణయం లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపశమనం కలిగించింది.
![]()
