ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. బుధవారం నాడిక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. అలాగే, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు పెట్టాలని కోరారు. దీని వలన రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు, రాష్ట్ర ప్రజల ఆశనెరవేర్చినట్లు అవుతుందని తెలిపారు. 
![]()
