ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ప్రధాన చర్చా అంశంగా నిలిచింది. మంగళవారం అసెంబ్లీలో సిఎం చంద్రబాబు ప్రసంగిస్తూ … 2019 నుండి టీటీడీలో నెయ్యి సరఫరా, లడ్డూ తయారీ వ్యవస్థలలో లోపాలు జరిగాయని అన్నారు. ఈ సమావేశంలో పవర్ పాయింట్ స్లైడ్స్ ద్వారా లడ్డూ కల్తీ, నెయ్యి నాణ్యత సమస్యలపై వివరణ ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ …. వెంకటేశ్వర స్వామి దైవంపై జరిగిన అన్యాయం పట్ల తాము ఆవేదనతో ఉన్నామని, టీటీడీ వ్యవస్థలో నిబంధనలు బదిలీ చేయక, నెయ్యి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కల్తీ జరిగిందని తెలిపారు. రూ.20.01 కోట్ల విలువ గల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారై విక్రయించారని, దీనికి రూ.234 కోట్లు ఖర్చు చెల్లించారన్నారు. గత టీటీడీ బోర్డు నిబంధనలను సరిగ్గా పాటించక, టెండర్లు మేకింగ్‌లో లోపాలు చేసిందని చెప్పారు. సిబిఐ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు, రిపోర్టులు, నెయ్యి శాంపిల్స్ పరిశీలనల ద్వారా కల్తీ జరిగిందని తేలిందన్నారు. 
![]()
