:
పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నెల 5 నుంచి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం తన వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిల్లో గుర్తించిన 210 సమస్యాత్మక కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుచేశారు. మాల్ ప్రాక్టీస్ నివారణకు 156 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను నియమించారు. ఎపిఎస్‌ఆర్‌టిసిలో హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఉచిత ప్రయాణం పొందొచ్చు.
![]()
