ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రక ఘట్టానికి అంకురార్పణ జరిగిందని, భోగాపురం సమీపంలో ఏర్పాటు కానున్న జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలవనుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా
అన్నారు. ప్రపంచ సివిల్ ఏవియేషన్ రంగంలోని వర్క్ ఫోర్స్లో 25 శాతం తెలుగువారు ఉండాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో, మాన్సాస్ ట్రస్ట్ సహకారంతో జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) మంత్రి లోకేశ్ సమక్షంలో జరిగింది. భీమిలి మండలం అన్నవరం వద్ద 136.63 ఎకరాల్లో ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీని అభివృద్ధి చేయనున్నారు.
![]()
