ఎవరైనా భూకబ్జా చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్న చిన్న భూతగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నానని, ముందుగా కుటుంబసభ్యులు, బంధువులతో వివాదాలు వద్దని కోరారు. గొడవలు పడి కోర్టులకు వెళ్తే జీవితకాలం వృథా అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదికలో సభలో పాల్గొని మాట్లాడారు. రైతుల భూమి పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు వేశారో అర్థం కాలేదని అన్నారు. గత ప్రభుత్వ నేతలవి ప్రమాదకరమైన ఆలోచనలని ‘మీ భూమి – మీ హక్కు’ అని ఎన్నికల ప్రచారంలోనే తాము చెప్పినట్లు గుర్తు చేశారు. రాజముద్ర వేసి పాస్బుక్లు ఇస్తామని హామీ ఇచ్చామని, దాన్ని ఇప్పుడు నెరవేర్చామని సీఎం తెలిపారు.
![]()
