తుళ్లూరు (అమరావతి) : రాజధానిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ హాజరయ్యారు. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.
![]()
