రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ప్రారంభించిన “ ఆత్మీయ కలయిక.. ఇల్లే వేదిక ” కార్యక్రమంలో భాగంగా ఆయన నివాసంలో నిర్వహించిన విందు సమావేశంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధును, వారి కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానిస్తూ ఒక్కొక్కరితో ఆప్యాయంగా ముచ్చటించడం లోకేష్ గారి వినయం, ఆత్మీయతను ప్రతిబింబించిందన్నారు. అతిథులకు స్వయంగా భోజనం వడ్డిస్తూ అందరినీ కుటుంబ సభ్యుల్లా పలకరించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని కొనియాడారు.పార్టీని ఒక పెద్ద కుటుంబంగా భావిస్తూ నాయకులు, వారి కుటుంబాల మధ్య బంధాలను మరింత బలపరచేలా లోకేష్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఆయన నాయకత్వంలోని ఆప్యాయతను స్పష్టంగా చూపించిందని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
![]()
