ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశంలోని ప్రముఖ పర్యాటక నిర్వాహకుల సంఘం ‘అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా
‘ సహకారంతో విశాఖపట్నం వేదికగా “ఏడీటీవోఐ నేషనల్ టూరిజం మార్ట్ 2025″ను నిర్వహించనుంది. ఈ మెగా ఈవెంట్‌ను 2026 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
![]()
