ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో ఉన్న ప్రఖ్యాత కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆశ్రమ అధ్యక్షులు కమలేష్ డి. పటేల్ (దాజీ)తో సమావేశమవుతారు. అనంతరం విజయవాడలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న తన నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి, 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకుంటారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన ఆశ్రమంలో పర్యటిస్తారు. 
![]()
