ఏలూరు: ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నర్మించుకోవాలనే ఆకాంక్షతో తాను కోరితే ప్రజలు కూటమి అభ్యర్థులను 164 సీట్లలో గెలిపించి తమకు అపూర్వ మద్దతును అందించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా నాయుడు అన్నారు. ఇన్ని సీట్లు ఇవ్వడం ద్వారా ప్రజలు తమ బాధ్యతను మరింత పెంచారని ఆయన పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో జరిగిన ‘పేదల సేవలో’ ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు సూపర్ సిక్స్‌ను ఎగతాళి చేశారని, అయితే ప్రజల మద్దతుతో దానిని సూపర్ హిట్ చేసి చూపించామని అన్నారు. గత 18 నెలల్లో పెన్షన్ల కోసమే రూ. 50,763 కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. సంక్షేమం కోసం దేశంలో ఎవరూ ఈ స్థాయిలో నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు కూడా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని ఆయన తెలిపారు.
ప్రతి ఏడాది రూ. 33 వేల కోట్ల చొప్పున ఐదేళ్ల కూటమి ప్రభుత్వం హయాంలో రూ.1.65 లక్షల కోట్ల మేర వ్యయం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రతీ నెల 63 లక్షల మందికి పైగా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 59 శాతం మంది మహిళలే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పెన్షన్లను ఎన్టీఆర్ ప్రారంభించగా, తమ ప్రభుత్వం వాటిని మరింత పెంచిందని ఆయన అన్నారు.
![]()
