రాష్ట్రంలో జిఎస్ డిపి వృద్ధి పెరగాలంటే అన్ని ప్రాంతాల్లో సమాన దృష్టి అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు
అన్నారు. అందుకే వికేంద్రీకరణ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా జిఎసిపి, శాఖల వారీగా కీ పర్ ఫార్మెన్స్ ఇండికేటర్లపై బుధవారం కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాల్లోనే కాకుండా శాఖల్లో కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ ఏడాది వృద్ధి లక్ష్యాన్ని 17.11 శాతంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఈ లక్ష్యం సాధించాలంటే 17 అంశాల్లో ఫలితాలు సాధించాల్సి ఉంటుందన్నారు. లైవ్ స్టాక్, ఉత్పాదక రంగం, ఫిషింగ్ వంటి రంగాలతో సహా ఇతర రంగాలపైనా కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ రంగం మరింతగా వృద్ధి చెందాలన్నారు. వీటన్నింటికీ జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. వచ్చే సదస్సు నాటికి జిల్లాల్లో ప్రగతి కనిపించాలని స్పష్టం చేశారు.
![]()
