అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం ఏర్పాటుతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులతో ‘క్వాంటమ్ టాక్ బై సీఎం సీబీఎన్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి
నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వాంటమ్ ప్రోగ్రామ్లో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్ధులకు సీఎం వివరించారు. 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
![]()
