అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రెండో విడత భూ సమీకరణకు (ల్యాండ్ పూలింగ్) రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఏడు గ్రామాల్లో భూములను సమీకరించేందుకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియను చేపట్టాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు.
రెండో విడతలో భాగంగా రాజధాని పరిధిలోని అమరావతి, తుళ్లూరు మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూమిని సమీకరించనున్నారు. ఇందులో 16,562.52 ఎకరాలు పట్టా భూములు కాగా, 104.01 ఎకరాలు అసైన్డ్ భూములుగా ఉన్నాయి. ఈ సమీకరణ పూర్తయ్యాక, అదనంగా 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా అందుబాటులోకి వస్తుంది. దీంతో రాజధాని అభివృద్ధి పనుల కోసం మొత్తం 20,494 ఎకరాలు సిద్ధం కానున్నాయి.
![]()
