ఆంధ్రప్రదేశ్లోని రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరంలో కీలకమైన శుభవార్త అందించింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లకు తీవ్ర ఆటంకంగా మారిన 22ఏ నిషిద్ధ జాబితా నుంచి 5 రకాల భూములను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం తన శాఖలో తొలి సంతకం చేశారు.
![]()
