ఆంధ్రప్రదేశ్ రాజధా
ని అమరావతికి అత్యుత్తమ రహదారి కనెక్టివిటీని కల్పించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాజధాని నగరాన్ని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించే కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ ను బలోపేతం చేయడంలో గడ్కరీ చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు.
![]()
