ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటిస్తున్నారు. శనివారం ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకన వెళ్లారు. అనంతరం రోడ్డు పనులను పరిశీలించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఓనూరు
లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పవన్ వెంట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అరకు పార్లమెంటు ఇంఛార్జి గంగులయ్య, నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా పవన్‌కు స్థానిక మహిళలు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. పవన్ సమక్షంలో పలువురు జనసేనలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓనూరులో అంగన్వాడీ సెంటర్‌ను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం అందించారు.
![]()
