అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అదాని గ్రూప్స్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదాని సమావేశమయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈ సమావేశం జరిగింది. ప్రత్యేక విమానం ద్వారా రాత్రి 7 గంటలకు అదాని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రిని తన నివాసంలో కలిశారు. చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అదానికి పూల బొకేతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో అదాని గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై ఈ సమావేశంలో చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. 
![]()
