ఈ ఏడాది డిసెంబర్‌లోపు భూ సమస్యలన్నీ పరిష్కారిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాయలసీమలోని ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వాలని సంకల్పించామని తెలిపారు. సోమవారం ఆయన నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజులో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ గ్రామ సభలో మాట్లాడారు. తప్పులు లేకుండా పాసుపుస్తకాలు ఇవ్వడం తన బాధ్యతన్నారు. గత ప్రభుత్వంలో మంత్రి తన అనుచరులకు ఇతరుల భూమిని ఇచ్చారంటే, వారి ఆక్రమణలు అర్థం అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3.90 కోట్ల ఎకరాల భూములు ఉంటే, 1.95 కోట్ల ఎకరాలను 22 ఎ, ఎస్టేట్, ఇనాం భూములుగా పెట్టేశారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములు కాజేసినా అడిగే దిక్కులేకుండా చేశారని, ఫొటోల పిచ్చితో జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
![]()
