పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి (ఏప్రిల్-డిసెంబర్ 2025) దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో ఏపీ ఏకంగా 25.3 శాతం వాటాను దక్కించుకుంది.
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలకు శుభవార్త అని, కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభమని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వ ముందుచూపుతో కూడిన విధాన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.
![]()
