విజయనగరం జిల్లా
ని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఉదయం 10.15 గంటల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ ఇక్కడి రన్‌వేపై దిగింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్ తదితరులు ప్రయాణించారు.
![]()
