మహిళలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్.టి. రామారావుదేనని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ మహిళలు బాగా చదువుకోవాలని ప్రత్యేక విశ్వవిద్యాలయాలను ఎన్టీఆర్ తెచ్చారని గుర్తు చేశారు.
అంతేకాకుండా మహిళలకు స్థానిక సం
స్థల్లో రిజర్వేషన్లు తెచ్చిన ఘనత సైతం ఎన్టీఆర్కు దక్కుతుందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సంపాదిస్తున్నారని సీఎం చమత్కరించారు. ఆడపిల్ల పుడితే రూ.5,000 బ్యాంకులో డిపాజిట్ చేశామని సీఎం వివరించారు. హైస్కూల్ విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహించామని తెలియజేశారు. గతంలో మహిళలు బయటకు వస్తే ఎగతాళి చేసేవారని సీఎం పేర్కొన్నారు.
![]()
