వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలన్నీ భక్తుల గోవిందా గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆర్థరాత్రి నుంచే పలు దేవాలయాల వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం అర్థరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అంతకుముందు మూల విరాట్టుకు అర్చకులు ఏకాంతంగా కైంకర్యాలను నిర్వహించారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వారాలను అర్చకులు తెరిచారు. వేకువజామున 1.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు.
![]()
